News30th Apr 01:33 PMSunil Byrisetty1 min read
దేవినేని కుమారుడి వివాహం.. హాజరైన రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అనుపమ దంపతుల కుమారుడు నిహార్, కీ.శే. అనుమోలు రవికుమార్, నీరజ దంపతుల ఏకైక కుమార్తె సాయి నర్మదల వివాహం కంకిపాడులో జరిగింది. వివాహానికి తెలంగాణ సీ
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అనుపమ దంపతుల కుమారుడు నిహార్, కీ.శే. అనుమోలు రవికుమార్, నీరజ దంపతుల ఏకైక కుమార్తె సాయి నర్మదల వివాహం కంకిపాడులో జరిగింది. వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
పలువురు ఏపీ మంత్రులు, నేతలు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు.
ఇవాళ కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.
బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రికి ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, జనార్దన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
వివాహ వేడుకకు రేవంత్, నారా లోకేశ్ కలిసి వెళ్లారు.
విజయవాడ నుంచి తిరిగి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు.