National23rd Aug 11:35 AMSunil Byrisetty1 min read
89 కేసులతో రేవంత్ రెడ్డి టాప్!
దేశంలోని 30 మంది సీఎంలలో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులున్నట్లు పేర్కొంది. 10 మంది
దేశంలోని 30 మంది సీఎంలలో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబుపై 19 కేసులు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌పై 47 కేసులున్నట్లు పేర్కొంది. 10 మంది సీఎంలపై హత్యాయత్నం వంటి తీవ్రమైన ఆరోపణలున్నట్లు నివేదికలో తెలిపింది. ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ వివరాలు సేకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో ఏకంగా 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా ప్రకటించారు. ఈ సంచలన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.