Telangana1st Dec 11:35 AMSunil Byrisetty2 min read

రేవంత్ విజన్.. క్యూర్, ప్యూర్, రేర్!

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. తెలంగాణ మూడు పెద్ద ఆర్థిక జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ప్రత్యేక లక్ష్యం కేటాయించే అతి పెద్ద దీర్ఘకాలిక ప్రణా

రేవంత్ విజన్.. క్యూర్, ప్యూర్, రేర్!
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను విడుదల చేశారు. తెలంగాణ మూడు పెద్ద ఆర్థిక జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ప్రత్యేక లక్ష్యం కేటాయించే అతి పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికను ఆవిష్కరించారు. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచే లక్ష్యాన్ని ప్రకటించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌కు లక్షలాది మంది ప్రజలు, ISB నీతి ఆయోగ్ వంటి సంస్థలు సలహాలిచ్చాయి. ఇది పారదర్శకంగా, స్థిరంగా అమలయ్యే పాలసీ అవుతుందన్నారు. తెలంగాణను మూడు జోన్లుగా విభజించారు. 1. క్యూర్ – కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి హైదరాబాద్ మహానగరం క్యూర్ ఎకానమీ కిందకు వస్తుంది. కాలుష్యం లేని నెట్-జీరో సర్వీస్ సెక్టార్ హబ్‌గా ఈ ప్రాంతాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూసీ నది పునరుజ్జీవం, మెట్రో విస్తరణ, కాలుష్య కర్మాగారాలను బయటికి తరలించడం వంటి ప్రాజెక్టులు చేపడతారు. ఇక్కడ ఉద్యోగాలు, విద్య, వైద్యం అన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ కాలుష్యం జీరో అని రేవంత్ ప్రకటించారు. 2. ప్యూర్ – పెరి అర్బన్ రీజనల్ ఎకానమీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య బెల్ట్‌ను ప్యూన్ అని పిలుస్తున్నారు. రాష్ట్రాన్ని వేగంగా అనుసంధానం చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బెల్ట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు, బుల్లెట్ ట్రైన్, వరంగల్-అదిలాబాద్-భద్రాద్రి కొత్తగూడెం-రామగుండం విమానాశ్రయాలు, పోర్ట్ కనెక్టివిటీ వంటి ప్రాజెక్టులను ప్రతి చేస్తారు. తెలంగాణ భవిష్యత్‌కు ఇదే హార్ట్‌గా రేవంత్ భావిస్తున్నారు. 3. రేర్ – రూరల్ అగ్రికల్చర్ రిజనల్ ఎకానమీ రీజనల్ రింగ్ రోడ్ బయట నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణ వరకూ రేర్ కిందకు వస్తుంది. రైతులను అభివృద్ధిలో భాగస్వాములుగా మార్చి, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా చేసుకున్నారు. విత్తన ఉత్పత్తి కేంద్రంగా మార్చడం, ఆహార భద్రత, గ్రామీణ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. పట్టణం-గ్రామం అంతరం తొలగించి, రైతుకూ ఎక్కువ ఆదాయం సాధించడాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటారు.
Telangana Development
Revanth Reddy
Telangana Vision 2047
Cure Pure Rare
Hyderabad Urban Economy
Peri-Urban Economy
Rural Agriculture Economy
తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
వ్యవసాయ అభివృద్ధి
తెలంగాణ ఆర్థిక వృద్ధి
Scroll for the next article