Telangana4th Aug 06:04 PMSunil Byrisetty1 min read
అరెస్ట్ చేసినా.. భయమొద్దన్న కేసీఆర్
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదికపై చర్చిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదికపై చర్చిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొంత మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నానన్నారు. అయినా ఎవరూ భయపడవద్దని సూచించారు. కాళేశ్వరంపై కేబినెట్‌లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దామని, తర్వాత మన వ్యూహం రచిద్దామని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.