TTD17th Jan 12:35 PMSunil Byrisetty1 min read

దేవుని కడప బ్రహ్మోత్సవాలపై సమీక్ష

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి తొలి గడపైన దేవుని కడప బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు, పోలీసులతో టీటీడీ జేఈఓ వీరబ్

దేవుని కడప బ్రహ్మోత్సవాలపై సమీక్ష
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయానికి తొలి గడపైన దేవుని కడప బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు, పోలీసులతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. వేలాది గా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 25న రథసప్తమి రోజున ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని జేఈఓ కోరారు. ఆలయ అర్చకులు మయూరం కృష్ణ స్వామి,టీటీడీ అధికారులు, చిన్నచౌక్ సిఐ ఓబులేసు, ఎస్సై రాజరాజేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
Andhra Pradesh
Devuni Kadapa
Brahmotsavams
Sri Lakshmi Venkateswara Swamy Temple
TTD
JEO Veerabrahmam
Tirumala Tirupati Devasthanams
తిరుమల తిరుపతి దేవస్థానాలు
భక్తులు
ఆలయ ఏర్పాట్లు
రథసప్తమి
పోలీస్ అధికారులు
Scroll for the next article