News20th Jan 04:40 PMSunil Byrisetty1 min read

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యం

మహిళలు, చిన్నారుల రక్షణ, భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒంగోలు, దర్శి, కందుకూరు, కనిగిరి, మార్కాపురం సబ్‌డివిజన్‌ల డీఎస్పీలు, శక్తి బృందా

మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యం
మహిళలు, చిన్నారుల రక్షణ, భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒంగోలు, దర్శి, కందుకూరు, కనిగిరి, మార్కాపురం సబ్‌డివిజన్‌ల డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శక్తి బృందాల విధులు, శక్తి యాప్ డౌన్‌లోడ్ ప్రక్రియ, మహిళల భద్రత, గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు గ్రామ, వార్డు పరిధిలోని బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద నిరంతరం పర్యటిస్తూ మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యత, అందులో లభించే సేవలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
Andhra Pradesh
Women Safety
Child Safety
Prakasam District Police
SP V Harshavardhan Raju
Shakti Teams
Shakti App
Video Conference Review
ఈవ్ టీజింగ్ నియంత్రణ
గంజాయి మాదకద్రవ్యాల నియంత్రణ
Scroll for the next article