News3rd Jan 12:29 PMSunil Byrisetty1 min read

మోర్తు అధికారులతో.. ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు,ఎంపీల సమీక్ష

గుడివాడ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర బడ్జెట్లో నిధులు అవుతున్నాయని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న

మోర్తు అధికారులతో.. ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు,ఎంపీల సమీక్ష
గుడివాడ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర బడ్జెట్లో నిధులు అవుతున్నాయని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన రైలు సర్వీస్ ల దారి మల్లింపుకు అనుమతులు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధి, నూతన ప్రాజెక్టులపై.. మచిలీపట్నంలోని ఎంపీ వల్లభనేని బాలసౌరి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీలు వల్లభనేని బాలసౌరి, కేశినేని చిన్ని, ఉమ్మడి జిల్లాల పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు NHAI, MoRTH శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణ వ్యాప్తంగా ఉన్న మెయిన్ రోడ్డు పనులు కూడా త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు. గుడివాడ టు కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, గుడివాడ మీదగా ఉన్న మచిలీపట్నం టూ నూజివీడు 216 అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నట్లు చెప్పారు.
Andhra Pradesh
MoRTH Review Meeting
Krishna District
Gudivada MLA
Venigandla Ramu
MPs Meeting
National Highways Development
NHAI
Vallabhaneni Balasouri
ఫ్లైఓవర్ నిర్మాణం
గుడివాడ
మచిలీపట్నం
నూజివీడు
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు
Scroll for the next article