News14th Dec 03:57 PMSunil Byrisetty1 min read

హస్తకళలకు పూర్వవైభవం తేవాలి

మన ప్రాంతానికి గర్వకారణమైన హస్తకళలను కాపాడుకుంటూ, రాబోయే తరాలకు ఈ నైపుణ్యాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా, గొలుగొండ

హస్తకళలకు పూర్వవైభవం తేవాలి
మన ప్రాంతానికి గర్వకారణమైన హస్తకళలను కాపాడుకుంటూ, రాబోయే తరాలకు ఈ నైపుణ్యాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా, గొలుగొండ మండలం, కృష్ణదేవిపేటలో ఆదివారం కేంద్ర, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కళాకారులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 50 మంది హస్త కళాకారులకు సుమారు రూ. 5 లక్షల విలువచేసే కార్పెంటరీ టూల్ కిట్లను (వుడ్ కార్వింగ్ పనిముట్లు) ఉచితంగా అందజేశారు. స్పీకర్ మాట్లాడుతూ.. మన ప్రాంతంలో ఏటికొప్పాక బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. వస్తువులను తయారు చేయడంతో పాటు, వాటిని మార్కెటింగ్ చేసుకోవడం కూడా కళాకారులకు ఎంతో ముఖ్యమని సూచించారు. సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక కళాకారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, విశాఖపట్నంలోని లేపాక్షి వంటి సంస్థలతో అనుసంధానం చేసి విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో కళాకారుడికి రూ. 10,000 విలువైన ఆధునిక పనిముట్లు ఇవ్వడం వల్ల వారి పనిలో నాణ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Ayyanna Patrudu
Handicrafts
Artisan Empowerment
Etikoppaka Toys
Wood Carving
Skill Development
Cottage Industry
కుటీర పరిశ్రమలు
సాంస్కృతిక వారసత్వం
లేపాక్షి
మేడ్ ఇన్ ఇండియా
లోకల్‌కు ప్రాధాన్యం
Scroll for the next article