News29th Dec 02:14 PMSunil Byrisetty1 min read

రాష్ట్రంలో విద్యుత్ బస్సుల విప్లవం

విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో ముందడుగు వేస్తున్నాయి. రాష్ట్రానికి పీఎం-ఈబస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులను కేంద్ర పట్టణ, గృహనిర్మాణ

రాష్ట్రంలో విద్యుత్ బస్సుల విప్లవం
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరో ముందడుగు వేస్తున్నాయి. రాష్ట్రానికి పీఎం-ఈబస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులను కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ కేటాయించిందని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. అందులో 150 బస్సులను విశాఖ నగరంలో వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆపరేటర్లను గుర్తించేందుకు వీలుగా ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీచేసినట్లు పేర్కొంది. అలాగే సిటీ సబర్బన్ సర్వీసుల కోసం మరిన్ని విద్యుత్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో నగరాల్లో కాలుష్యం తగ్గడంతోపాటు శబ్ధరహిత ప్రయాణానికి నాంది పలికినట్లు కానుంది.
Andhra Pradesh Transport
Electric Buses
PM-EBS Scheme
Visakhapatnam
Energy Efficiency
కాలుష్య తగ్గింపు
శబ్దరహిత ప్రయాణం
నగర రవాణా
చంద్రబాబు నాయుడు చర్యలు
Scroll for the next article