Education8th Sep 05:16 PMSunil Byrisetty1 min read
వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రంలో వైద్య విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, పరిశోధనలను ప్రోత్సహించడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు డా. ఎన్టీఆర్ హ
రాష్ట్రంలో వైద్య విద్యా ప్రమాణాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, పరిశోధనలను ప్రోత్సహించడం, అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా . పి.చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలోని డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆవరణలోని సిల్వర్ జూబ్లీ హాల్‌లో మంగళవారం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డా. పి. చంద్రశేఖర్, రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యా సలహాదారు (ఎన్నారై) డా. లోకేష్. ఈదర, ప్రముఖ అనస్థీషియాలజిస్ట్ డా. కె.వి. రావు లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన సర్వేలు, ఎన్ఐఆర్ఎఫ్, న్యాక్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర కళాశాలలు ఉత్తమ ప్రతిభ కనబరిచాయన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్ జాతీయ స్థాయిలో 3వ స్థానం, రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా; గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి సహా ఆరు కళాశాలలు అత్యుత్తమ ర్యాంకులు సాధించాయన్నారు. విద్యార్థుల అధ్యయనం కోసం త్వరలోనే ‘లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’, కృత్రిమ మేధ ఆధారిత విద్యా విధానాన్ని యూనివర్శిటీలో అమలు చేస్తామన్నారు. ముందుగా ప్రభుత్వ కళాశాలల్లో, అనంతరం ప్రైవేట్ కళాశాలల్లో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.