Entertainment22nd Nov 02:53 PMSunil Byrisetty1 min read
పైరసీపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని రాబిన్‌హుడ్‌తో పోల్చడాన్ని తప్పుబట్టారు. రాబిన్‌హుడ్ హీరో కాదన్నారు. పైరసీదారుల
సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవిని రాబిన్‌హుడ్‌తో పోల్చడాన్ని తప్పుబట్టారు. రాబిన్‌హుడ్ హీరో కాదన్నారు. పైరసీదారులే కాదు.. పైరసీ చూసేవాళ్లు కూడా నేరస్థులేనని వ్యాఖ్యానించారు. పైరసీని చూసే 100 మందిని అరెస్టు చేసి.. వారి పేర్లు బయటపెట్టాలన్నారు. పైరసీ సమస్యకు భయం ఒక్కటే పరిష్కారమని.. నైతిక విలువలు పనిచేయవని అభిప్రాయపడ్డారు. టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని పైరసీ చేయడం సరికాదన్నారు. కార్లు, గోల్డ్ ధరలు ఎక్కువగా ఉన్నాయని లూటీ చేయలేం కదా అని దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.