News8th Aug 04:41 PMSunil Byrisetty1 min read

రైజ్ రెక్క‌ల‌తో మ‌హిళ‌ల విజ‌య విహంగం

మ‌హిళ‌ల్లో దాగిఉన్న వ్యాపార నైపుణ్యాల‌ను వెలికితీసి, వారిని పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దే దిశ‌గా రైజ్ కేంద్రం విశేషంగా కృషిచేస్తోంద‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష

రైజ్ రెక్క‌ల‌తో మ‌హిళ‌ల విజ‌య విహంగం
మ‌హిళ‌ల్లో దాగిఉన్న వ్యాపార నైపుణ్యాల‌ను వెలికితీసి, వారిని పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దే దిశ‌గా రైజ్ కేంద్రం విశేషంగా కృషిచేస్తోంద‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌, మార్గ‌ద‌ర్శ‌క‌త్వం, సాంకేతిక స‌హ‌కారం, మార్కెటింగ్ అవ‌కాశాల‌ను అందిస్తూ రైజ్ కేంద్రం ఒక ప్ర‌త్యేక గ్రామీణ ఇంక్యుబేష‌న్ సెంట‌ర్‌గా ఎదుగుతోంద‌ని పేర్కొన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నం రైజ్ కేంద్రంలో జ‌రిగిన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌పోను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. రైజ్ కేంద్రం చేయూత‌తో ఏర్పాటుచేసిన పారిశ్రామిక యూనిట్ల ఉత్ప‌త్తులతో ఏర్పాటు చేసిన 27 స్టాళ్ల‌ను ప‌రిశీలించారు. ఈ కేంద్రంలో ప్ర‌తిరోజూ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌తో పాటు ప్ర‌తి శ‌నివారం వ‌ర్క్‌షాప్‌లు, ఎప్ప‌టిక‌ప్పుడు జాబ్ మేళాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విధంగా ఇప్ప‌టికే 30 వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హించామని.. అయిదువేల మంది మ‌హిళ‌ల‌కు చేరువ‌య్యామ‌ని తెలిపారు.
Andhra Pradesh
RISE Centre
Women Entrepreneurs
Women Empowerment
NTR District
G. Lakshmi
Ibrahimpatnam
Self Help Groups
గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్
నైపుణ్యాభివృద్ధి
పారిశ్రామికవేత్తలు
మహిళా స్వయం ఉపాధి
Scroll for the next article