Mobiles22nd Aug 01:35 PMSunil Byrisetty1 min read

ఫోన్ల ధరలు పైపైకి.!

స్మార్ట్‌ఫోన్ల ధరలు మండుతున్నాయి. ‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్‌ విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో మొబైల్‌ ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే రియల్‌మీ, ఒప్పో, వివో, శామ్‌సంగ్, వన

ఫోన్ల ధరలు పైపైకి.!
స్మార్ట్‌ఫోన్ల ధరలు మండుతున్నాయి. ‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్‌ విడిభాగాల ధరలు భారీగా పెరగడంతో మొబైల్‌ ధరలు పెంచుతున్నాయి. ఇప్పటికే రియల్‌మీ, ఒప్పో, వివో, శామ్‌సంగ్, వన్‌ప్లస్‌ వంటి బ్రాండ్లు ఎంపిక చేసిన మోడళ్ల ధరలు పెంచాయి. రియల్‌మీ: ఆగస్టు 18 నుంచి పలు మోడళ్లపై రూ.1000-4000 వరకు ధరలు పెంచింది. ఒప్పో: రెనో, ఏ-సిరీస్‌ ఫోన్లపై గరిష్ఠంగా రూ.5,000 వరకు పెంచింది. వివో: పలు ప్రాంతాల్లో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.500-4,000 వరకు ధరలను సవరించింది. శామ్‌సంగ్‌: ఎస్‌-సిరీస్, ఎం-సిరీస్, ఎఫ్‌-సిరీస్‌ ఫోన్ల ధరలను పెంచింది. ముఖ్యంగా గెలాక్సీ ఎస్‌25 వేరియంట్‌ ధర రూ.12,000 ప్రియమైంది. వన్‌ప్లస్‌: ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై రూ.2,000-4,000 వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. మెమొరీ ఖర్చులు పెరగడం వల్ల 2026 రెండో త్రైమాసికం నాటికే స్మార్ట్‌ఫోన్‌ సగటు ధరలు దాదాపు 15% పెరిగాయని ఐడీసీ ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషి తెలిపారు. రాబోయే నెలల్లో మొబైల్‌ విడిభాగాల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, స్మార్ట్‌ఫోన్‌ ధరలు మరో 7-10% పెరిగే అవకాశం ఉందని అంచనా.
Smartphone Prices
Mobile Phone Prices
Price Hike
Realme
Oppo
Vivo
Samsung
OnePlus
Smartphones
Memory Chips
Chipset Prices
Technology
Smartphone Market
Mobile Market
IDC
Tech News
Gadgets
Consumer Electronics
Scroll for the next article