News30th Oct 01:00 PMSunil Byrisetty1 min read

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదను పర్యవేక్షించిన మంత్రి రామానాయుడు

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరిగేషన్ అధికారులతో కలసి కృష్ణా నది వరదను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, ఉపనదులకు భారీ వరద వస్తుండటంతో

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదను పర్యవేక్షించిన మంత్రి రామానాయుడు
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరిగేషన్ అధికారులతో కలసి కృష్ణా నది వరదను మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షించారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, ఉపనదులకు భారీ వరద వస్తుండటంతో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజికి 6 నుండి 6.5లక్షల క్యూసెక్కుల కు పైగా వరద వస్తుండటంతో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కృష్ణాడెల్టా పరిధిలో అధికారులు అందరూ క్షేత్రస్దాయిలో పర్యవేక్షిస్తూ, మందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం,అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు పొంగుతుండంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈరోజు అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు వాగుల గట్లు, కాల్వ గట్లు పట్ల అప్రమతంగా ఉండాలని మంత్రి కోరారు.
Andhra Pradesh
Irrigation Department
Heavy Rains
Krishna River
Prakasam Barrage
ఇరిగేషన్ శాఖ
భారీ వర్షాలు
కృష్ణా డెల్టా
వరద హెచ్చరిక
Scroll for the next article