News31st Aug 03:44 PMSunil Byrisetty1 min read
నదుల అనుసంధానంతో దేశం సుభిక్షం
దేశమంతా నేడు నీటి సమస్య ఎదుర్కొంటోందని, దీనిక ఏకైక పరిష్కార మార్గం ‘నదుల అనుసంధానం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానం జరగాలంటే అది ప్రధాని నరేంద్ర మోదీకే సాధ్యమన్నారు. పో
దేశమంతా నేడు నీటి సమస్య ఎదుర్కొంటోందని, దీనిక ఏకైక పరిష్కార మార్గం ‘నదుల అనుసంధానం’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. నదుల అనుసంధానం జరగాలంటే అది ప్రధాని నరేంద్ర మోదీకే సాధ్యమన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని, 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి, గోదావరి పుష్కరాల కన్నా ముందే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాతి ఏడాది కృష్ణా పుష్కరాలను మార్కాపురంలో కూడా వైభవంగా జరుపుకొందామని పిలుపునిచ్చారు. గోదావరి నీరు కూడా నల్లమల సాగర్ కి రావాలన్నారు. దక్షిణ భారతదేశంలో గోదావరి, కావేరి అనుసంధానం చేయాలని తాను చెప్పానని, దీనివల్ల గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, తుంగభద్ర అనుసంధానమవుతాయని వివరించారు. ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో నీటి యుద్ధాలు తీరిపోయి, సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. నేడు గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయని, వాటిని దారిమళ్లించగలిగితే సంపద సృష్టి జరుగుతుందన్నారు. అనంతరం గోదావరి, మహానది నదులను, అక్కడి నుంచి గంగా నది, బ్రహ్మపుత్ర వరకు కలపగలిగితే దేశానికి తిరుగుండదని, దేశం సుభిక్షమవుతుందని పేర్కొన్నారు.