Politics18th Jul 02:42 PMSunil Byrisetty1 min read

రోజా అనొచ్చు కానీ.. రోజాను అనకూడదట!

గత ప్రభుత్వంలో వంగలపూడి అనిత వ్యక్తిత్వంపై రోజా చేసిన దారుణమైన కామెంట్లను సమాజం మర్చిపోలేదు. ఆ కామెంట్లతో వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఒక చీకటి అధ్యాయం. రోజా ఒక్కరని కాదు.. టీ

రోజా అనొచ్చు కానీ.. రోజాను అనకూడదట!
గత ప్రభుత్వంలో వంగలపూడి అనిత వ్యక్తిత్వంపై రోజా చేసిన దారుణమైన కామెంట్లను సమాజం మర్చిపోలేదు. ఆ కామెంట్లతో వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఒక చీకటి అధ్యాయం. రోజా ఒక్కరని కాదు.. టీడీపీ నేతలపై వాడిన బూతులు ఘోరాతిఘోరం. అలాంటి రోజా ఇప్పుడు తనపై నగరి ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదులు చేశారు. నగరిలో ఇసుక తరలిస్తున్న రోజా అనుచరులైన ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. రోజా సోదరుడు ఈ ఇసుక మాఫియా ముఠాకు నాయకుడన్న పేరు ఉంది. ఇసుక లారీల్ని సీజ్ చేసి.. కౌన్సిలర్లను అరెస్టు చేశారని తెలియగానే రోజా నగరిలో దిగిపోయారు. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై బూతులందుకున్నారు. కౌంటర్ గా గాలి భానుప్రకాష్ కూడా మండిపడ్డారు. రూ. రెండు వేలకు సినిమాల్లో వేషాలేసుకునే స్థాయి నుంచి రెండు వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలన్నారు. కానీ భానుప్రకాష్ .. రెండు వేలకు తాను అన్ని పనులు చేస్తానని అన్నారని అది తనను అవమానించడమేనని రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మాటలు చూస్తుంటే రోజా అనొచ్చు కానీ రోజాను అనకూడడా అని ముక్కున వేలేసుకుంటున్నారు.
Andhra Pradesh news
ap politics
Roja
Vangalapudi Anitha
Tdp
MLA Gali Bhanuprakash
police case
నగరి ఎమ్మెల్యే అసభ్య వ్యాఖ్యలు
Scroll for the next article