Politics17th Aug 01:21 PMSunil Byrisetty1 min read
శ్రీశక్తి పేరుతో స్త్రీల దగా!
రాష్ట్రంలో ఉచిత బస్సు అంటూ ఊదరగొట్టి తుస్సుమనిపించారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. మొత్తం 16 రకాల బస్సులు ఉంటే 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటై
రాష్ట్రంలో ఉచిత బస్సు అంటూ ఊదరగొట్టి తుస్సుమనిపించారని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. మొత్తం 16 రకాల బస్సులు ఉంటే 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల తర్వాత ఉచిత బస్సు ప్రారంభించారని వ్యాఖ్యానించారు.
లోకల్ గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచితబస్సులకు అమలు చేశారన్నారు. రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు కోతల ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుందని విమర్శించారు. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉచిత దర్శనం లేదన్నారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదని రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.