Politics17th Apr 05:54 PMSunil Byrisetty1 min read

పదవులు.. ప్యాకేజీలతో నోరు మూతబడిందా? పవన్‌పై రోజా ఫైర్!

పదవులు, ప్యాకేజీలతో పవన్ కల్యాణ్ నోరు మూతబడిందా అంటూ మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. ‘మీకు, మీ అన్నకు పదవులు ఇస్తే చాలా అంటూ మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు తిరుమలలో అపచ

పదవులు.. ప్యాకేజీలతో నోరు మూతబడిందా? పవన్‌పై రోజా ఫైర్!
పదవులు, ప్యాకేజీలతో పవన్ కల్యాణ్ నోరు మూతబడిందా అంటూ మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. ‘మీకు, మీ అన్నకు పదవులు ఇస్తే చాలా అంటూ మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు తిరుమలలో అపచారాలు, ఘోరాలపై మాట్లాడరా అని ప్రశ్నించారు. సనాతన ధర్మంలో గోమాతలను పూజిస్తారని... ఈరోజు గోశాలలో గోవులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని రోజా అన్నారు. దేవుడితో ఎవరూ పెట్టుకోవద్దని చెప్పారు. తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసినా ఎంత పెద్దవారైనా కేసులు పెట్టాలని.. కానీ, గోశాలలో జరిగిన విషయాన్ని బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెట్టాలని అనడం సరికాదన్నారు. గోశాల పరిస్థితికి కారణమైన వారిపై కేసులు పెట్టి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
TTD Goshala Incident
Roja
Bhoomana Karunakar Reddy
Pawan Kalyan
Chandrababu Govt
గోశాల
తిరుమలలో అపచారాలు
Scroll for the next article