Politics10th Jun 12:09 PMSunil Byrisetty1 min read
హోంమంత్రి రాజీనామా చేయాలి!
ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా అన్నారు. మహిళలను చంపేస్తుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కనీసం మాట్లాడటం లేదన్నాురు. మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకు రక
ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా అన్నారు. మహిళలను చంపేస్తుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కనీసం మాట్లాడటం లేదన్నాురు. మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. హోంమంత్రి అనిత తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిన్న పాపను చంపేసి, పూడ్చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. తన్మయ్ అనే గిరిజన అమ్మాయి కనిపించడంలేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. ఫిర్యాదును పట్టించుకోక పోవడం వల్లనే తన్మయ్ శవమై కనిపించిందని విమర్శించారు. మహిళలకు అన్యాయం జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు.