Politics6th Jan 01:08 PMSunil Byrisetty1 min read
వడ్డీతో సహా చెల్లించుకోక తప్పదన్న రోజా!
కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయ
కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారులు చంద్రబాబు, లోకేశ్‌లకు భజన బ్యాచ్‌లా తయారయ్యారని మండిపడ్డారు. రేపు మా ప్రభుత్వం వచ్చాక ప్రతి అధికారి పదింతలు చెల్లించుకోవాల్సి ఉంటుందని రోజా హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పిన్నెల్లి కుటుంబానికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా రోజా స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు రూ. 3 లక్షల కోట్ల అప్పులు చేశారని అన్నారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు.