News12th Dec 10:37 AMSunil Byrisetty1 min read

అల్లూరి జిల్లాలో లోయలోకి బస్సు

ఏపీలో బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట

అల్లూరి జిల్లాలో లోయలోకి  బస్సు
ఏపీలో బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడింది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది వరకు యాత్రికులు ఉన్నారు. వీరిలో 12 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందినవారిగా సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Andhra Pradesh
Private Bus Mishap
Alluri Seetharama Raju District
Bus Accident
Chinturu
Maredumilli Ghat Road
Rajugarimetta
Bhadrachalam
భద్రాచలం
అన్నవరం
చిత్తూరు ప్రయాణికులు
రోడ్డు ప్రమాదం
Scroll for the next article