News21st Jun 01:21 PMSunil Byrisetty1 min read

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడీ!

.పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న రైలు నెల్లూరు జిల్లా కావలి-శ్రీవెంకటేశ్వర పాలెం మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీవెంకటేశ్వ

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడీ!
.పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న రైలు నెల్లూరు జిల్లా కావలి-శ్రీవెంకటేశ్వర పాలెం మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీవెంకటేశ్వర పాలెం సమీపంలోకి రాగానే, గుర్తుతెలియని దుండగులు రైలులోని మూడు బోగీల్లోకి ప్రవేశించారు. నిద్రపోతున్న ముగ్గురు ప్రయాణికుల మెడలోంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు లాక్కెళ్లారు. వారి వద్ద ఉన్న రూ.20,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ దారి దోపిడీ కలకలం రేపింది. చోరీకి పాల్పడిన దొంగలు కదులుతున్న రైలు నుంచి దూకి పరారైనట్లు తెలుస్తోంది. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh news
padmavathi express
train
kavali
Sri Venkateswara Palem
Robbery
40 grams of gold
పద్మావతి ఎక్స్ప్రెస్లో దారి దోపిడీ
Scroll for the next article