Spiritual29th Nov 02:15 PMSunil Byrisetty1 min read

భవానీ దీక్ష విరమణకు పటిష్ఠ ఏర్పాట్లు

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్ష విరమణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్ల

భవానీ దీక్ష విరమణకు పటిష్ఠ ఏర్పాట్లు
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్ష విరమణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆలయ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భవాని భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు భద్రత కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు దర్శనం దీక్షల విరమణ ప్రాంతం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ ప్రసాదాల కౌంటర్లు తలనీలాలు సమర్పించే ప్రాంతం కీలకమైన విషయాలపై శనివారం ఉదయం ఇందుకు సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఈవో శీనా నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిప్రతిష్టాపన, శత చండీయాగం, గిరి ప్రదక్షిణలు వంటి ప్రధాన క్రతువులు జరుగుతాయి. భవానీ దీక్షల విరమణ కారణంగా డిసెంబర్ 11 నుండి 16 వరకు అన్ని ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసి, ఏకాంతంగా నిర్వహిస్తారు. భవానీ మండల దీక్షలు నవంబర్ 1 నుండి 5 వరకు, అర్ధ మండల దీక్షలు నవంబర్ 21 నుండి 25 వరకు జరిగాయి. డిసెంబర్ 4వ తేదీన కలశజ్యోతి మహోత్సవం నిర్వహించబడుతుంది. గత సంవత్సరం 18 లక్షల ప్రసాదాలు సిద్ధం చేయగా, ఈసారి సుమారు 30 లక్షల ప్రసాదాలు తయారు చేయాలని అంచనా వేశారు. బస్ రైల్వే స్టేషన్లతో కలిపి మొత్తం 19 ప్రసాదం విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.
Andhra Pradesh
Vijayawada
Bhavani Deeksha
Durga Temple
Deeksha Viramana
Temple Festival
Devotees
Prasadam
దుర్గా మల్లేశ్వర స్వామి
భక్తులు
ప్రసాదాలు
ఏర్పాట్లు
ఆర్జిత సేవలు
భవానీ మహోత్సవం
Scroll for the next article