News18th Sep 09:22 AMSunil Byrisetty1 min read

పటిష్టంగా డ్రైనేజీ వ్యవస్థ!

వర్షం వచ్చినప్పుడు నగరంలో నీరు నిలవకుండా మురుగునీటి వ్యవస్థ ను బాగుపరిచేందుకు 130 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను సిద్ధ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలి

పటిష్టంగా డ్రైనేజీ వ్యవస్థ!
వర్షం వచ్చినప్పుడు నగరంలో నీరు నిలవకుండా మురుగునీటి వ్యవస్థ ను బాగుపరిచేందుకు 130 కోట్ల రూపాయల వ్యయంతో ప్రణాళికను సిద్ధ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభం చేశారు. మురుగునీటినంతటినీ తీసుకొని పోయి ప్రధాన కాలువలోకి కలిపే విధంగా కాలువల నిర్మాణం జరుగుతోందన్నారు. వర్షం కురిసినప్పుడు ప్రధాన రహదారిపై నీరు నిలువ ఉండకుండా ప్రధాన కాలువలోకి ప్రవహించే విధంగా శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించామన్నారు. తద్వారా పరిశుభ్ర నగరంగా మచిలీపట్నాన్ని తీర్చిదిద్దవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Machilipatnam
Drainage System
Water logging Solution
Clean City Initiative
Major Canal Construction
Rainwater Management
Minister Kollu Ravindra
వర్షం నిర్వహణ
130 కోట్ల ప్రాజెక్టుకు శ్రీకారం
Scroll for the next article