News1st Aug 04:38 PMSunil Byrisetty1 min read

బంగారు క‌ల‌ల‌కు రోజా రంగుల రెక్కలు

మా మ‌న‌సూ బంగార‌మేన‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ పేద‌రిక నిర్మూల‌న మ‌హాయ‌జ్ఞ‌మైన పీ4లో మేమూ భాగ‌స్వాముల‌మ‌వుతామ‌ని.. త‌మ బాధ్య‌త‌గా కొన్ని బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని, ఆ కుటుంబాల

బంగారు క‌ల‌ల‌కు రోజా రంగుల రెక్కలు
మా మ‌న‌సూ బంగార‌మేన‌ని.. రాష్ట్ర ప్ర‌భుత్వ పేద‌రిక నిర్మూల‌న మ‌హాయ‌జ్ఞ‌మైన పీ4లో మేమూ భాగ‌స్వాముల‌మ‌వుతామ‌ని.. త‌మ బాధ్య‌త‌గా కొన్ని బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని, ఆ కుటుంబాల‌కు అండ‌గా ఉంటామంటూ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌భ్యులు ముందుకొచ్చారు. సొసైటీ ప్ర‌తినిధులు ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌తో క్యాంపు కార్యాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పీ4 విధానం విశిష్ట‌త‌ను వివ‌రించారు. స్వ‌ర్ణాంధ్ర సాకారం దిశ‌గా వేస్తున్న అడుగుల్లో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వం వినూత్నంగా ప్ర‌వేశ‌పెట్టిన పీ4 విధానంతో పేద‌ల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయ‌ని, 2029 నాటికి శూన్య పేద‌రికం ల‌క్ష్యంగా ఈ విధానాన్ని అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో 86,398 బంగారు కుటుంబాల‌ను గుర్తించామ‌ని, ఇప్పటికే 4,279 మంది మార్గ‌ద‌ర్శులుగా ముందుకొచ్చి 33,505 కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకున్నార‌ని వివ‌రించారు. ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు రెడ్‌క్రాస్‌, రోట‌రీ, ఆంధ్రా మోటార్ మ‌ర్చంట్స్ అసోసియేష‌న్ (అమ్మ‌) త‌దిత‌ర సంస్థ‌లూ ముందుకొచ్చాయ‌న్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మ‌రింత మంది స్వ‌చ్ఛందంగా ముందుకురావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని.. ప్ర‌భుత్వ పిలుపున‌కు స్పందించి పీ4లో భాగ‌మ‌య్యేందుకు ముందుకొచ్చిన రోజ్‌సొసైటీకి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు.
Andhra Pradesh Government
P4 Scheme
Poverty Eradication
Roja Society
NTR District
Golden Families
Collector G. Lakshmisha
Social Welfare
Public-Private Partnership
Community Development
రోజ్ సొసైటీ
బంగారు కుటుంబాలు
Scroll for the next article