News11th Jan 03:33 PMSunil Byrisetty1 min read
బరులు సిద్ధం.. కోర్టు వద్దన్నా కోళ్లు రెడీ!
సంక్రాంతి కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. పలు జిల్లాల్లో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12 నుంచి 16 వరకు నిర్వహణ చేయనున్నారు. ఏలూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా,
సంక్రాంతి కోడి పందేలకు బరులు సిద్ధమయ్యాయి. పలు జిల్లాల్లో కోడిపందాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 12 నుంచి 16 వరకు నిర్వహణ చేయనున్నారు.
ఏలూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ కోడిపందాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ పందాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు, అతిథుల కోసం రూములు, వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.
సొంత ఊర్లకు వచ్చిన వారు కోడిపందాలను ఆనందించాలని, ఊరంతా జనంతో సందడిగా ఉందని స్థానికులు తెలిపారు. అయితే కోర్టు కోడి పందేలు నిర్వహించకూడదని ఆదేశించినా ఎక్కడికక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి.