News6th Jul 12:01 PMSunil Byrisetty1 min read
నెల్లూరులో వైభవంగా రొట్టెల పండుగ
రొట్టెల పండుగ కోసం నెల్లూరు బారాషహీద్ దర్గా సిద్ధమైంది ఏటా జరిగే రొట్టెల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు
రొట్టెల పండుగ కోసం నెల్లూరు బారాషహీద్ దర్గా సిద్ధమైంది ఏటా జరిగే రొట్టెల పండుగ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. గతంలో కోరిక తీరిన భక్తుల నుంచి రొట్టెను స్వీకరించడం, తమ కోరిక తీరితే ఇతరులకు రొట్టెను ఇవ్వడం ఈ ఉత్సవంలో ఆచారం. స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం దర్గా వద్ద అసౌకర్యం కలగకుండా ప్రత్యేక టెంట్లు, తాగునీటి సౌకర్యం, ఉచిత భోజన వసతి తదితర పటిష్ట ఏర్పాట్లు కల్పించింది. మంత్రి లోకేష్ కూడా దర్గాను దర్శించనున్నారు.