News29th Nov 04:18 PMSunil Byrisetty1 min read

రూ.13.87లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలువురు బాధితులకు శనివారం రూ. 13.87లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. యర్రబాలెం కు చెందిన పసుపులేటి వెంకట శివరావు మంత్రి

రూ.13.87లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలువురు బాధితులకు శనివారం రూ. 13.87లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. యర్రబాలెం కు చెందిన పసుపులేటి వెంకట శివరావు మంత్రి లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏడు లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ ) మంజూరైంది. బాధితుల కుటుంబ సభ్యులకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో చెక్కును అందజేశారు. ఎల్ ఓ సి చెక్కు రావడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్ కు బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, గ్రామ పార్టీ అధ్యక్షులు నీలం అంకారావు తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి గ్రామానికి చెందిన రావుల సురేందర్ రెడ్డి కి మంజూరైన రూ. 1.27లక్షల విలువైన చెక్కును, ఈపూరి ప్రమీలకి రూ.60వేలు, పాలకాయల కామేశ్వరమ్మ కు రూ. 2లక్షలు, అన్నపూర్ణ సూర్యచంద్రరావు కు రూ.1.50 లక్షలు, సింగంశెట్టి వెంకట శివమ్మకు రూ.1.50లక్షలను అందజేశారు. చెక్కులు రావడానికి కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.
Andhra Pradesh
CMRF
Chief Minister Relief Fund
Cheque Distribution
Mangalagiri
Tadepalli
Minister Nara Lokesh
Beneficiary Support
Financial Aid
State Civil Supplies Corporation
పార్టీ నాయకులు
లెటర్ ఆఫ్ క్రెడిట్
గ్రామీణ అభివృద్ధి
ఆర్థిక సహాయం
Scroll for the next article