News23rd Apr 10:29 AMSunil Byrisetty1 min read

సత్యసాయికి అరుదైన నివాళి.. శత జయంతికి రూ.100 నాణెం

పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారు. శ్రీసత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడ

సత్యసాయికి అరుదైన నివాళి.. శత జయంతికి రూ.100 నాణెం
పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబాకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులున్నారు. శ్రీసత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్య సాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది. ఈ నాణెంతో బాబా శత జయంతికి నివాళి అర్పించనున్నారు.
sathya sai centenary
100 coin
శ్రీసత్య సాయిబాబా శతజయంతి
44mm చుట్టుకొలత
35 గ్రాముల బరువు
100 నాణెం
Scroll for the next article