News31st Aug 12:40 PMSunil Byrisetty1 min read

సంఘం కొందరిది కాదు.. అందరిదీ!

ఆర్ఎస్ఎస్ తీరు మారుతోంది. కొందరిది అనే అభిప్రాయం నుంచి అందరిదీ అనే బాట పడుతోంది. అఖండ భారత నిర్మాణం, భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించడం, హిందూ ఐక్యత తదితర అంశాల ప్రాతిపదికగా ప్రార

సంఘం కొందరిది కాదు.. అందరిదీ!
ఆర్ఎస్ఎస్ తీరు మారుతోంది. కొందరిది అనే అభిప్రాయం నుంచి అందరిదీ అనే బాట పడుతోంది. అఖండ భారత నిర్మాణం, భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించడం, హిందూ ఐక్యత తదితర అంశాల ప్రాతిపదికగా ప్రారంభమైన సంఘ్ తీరు ఇప్పుడు మారుతోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ న్యూయార్క్ వేదికగా చేసిన ముస్లింలు భారత్‌లో ఉండకూడదని కోరుకునేవారు అసలు హిందువులే కాదు అనే వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి. విదేశీ గడ్డపై భారతీయ వసుధైవ కుటుంబకం, సర్వమత సమభావం గురించి మాట్లాడటం, హిందూత్వాన్ని ఒక విశాలమైన జీవన విధానంగా ప్రతిపాదించడం ఆర్‌ఎస్‌ఎస్ విధానాలు మారుతున్నాయనడానికి అద్దం పడుతోందని చెబుతున్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాల్లో ముస్లిం మేధావులతో, సూఫీ మత పెద్దలతో మోహన్ భగవత్ స్వయంగా చర్చలు జరపడం, భారతీయులందరి డిఎన్ఏ ఒక్కటే అని గతంలో ప్రకటించడం వంటి చర్యలు సంఘ్ తన అంతర్గత భావజాలంలో తెస్తున్న మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.
Indian Politics
RSS
Rashtriya Swayamsevak Sangh
Mohan Bhagwat
RSS Ideology
Hinduism
Hindutva
Hindu Unity
Religious Harmony
Muslim Community
India
భారతీయ రాజకీయాలు
జాతీయవాదం
వసుధైవ కుటుంబకం
సర్వమత సమభావం
సామాజిక సామరస్యం
Scroll for the next article