News23rd Jul 09:17 AMSunil Byrisetty1 min read
ఉచిత బస్సుకు ఆర్టీసి కసరత్తు!
ఎన్నికల ముందు టీడీపీ ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై ప్రభుత్వం ఆదేశాలతో ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్
ఎన్నికల ముందు టీడీపీ ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీపై ప్రభుత్వం ఆదేశాలతో ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజున ప్రారంభమయ్యే ఈ పథకానికి అనుగుణంగా మహిళా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కడప ఆర్టీసీ జోన్ పరిధిలోని 8 జిల్లాలకు సంబంధించి జోనల్ వర్క్ షాపులో తొలుత 150 బస్సులకు మార్పులు చేస్తున్నారు. బస్సు మధ్యలో తలుపు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహిళలు కూర్చునే సీట్లకు పసుపు రంగు వేస్తున్నారు.