News20th Aug 11:56 AMSunil Byrisetty1 min read
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
అనంతపురం జిల్లా మడకశిరలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. గుడిబండ మండలంలో హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మడకశిర మీదుగా కర్ణాటకలోని లింగదహళ్లికి వెళ్లి తిరిగి వస్తోంది.
అనంతపురం జిల్లా మడకశిరలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. గుడిబండ మండలంలో హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మడకశిర మీదుగా కర్ణాటకలోని లింగదహళ్లికి వెళ్లి తిరిగి వస్తోంది. ఆ సమయంలో హఠాత్తుగా బైరేపల్లి వద్ద బస్సు వెనుక రెండు చక్రాలు ఊడిపోయాయి. ఈ ఘటనతో వాహనం ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు నేలపై కూలిపోయింది. కాలం చెల్లిన బస్సులు నడపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఎవ్వరికి ఎటువంటి అపాయం జరగలేదు. అయితే ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.