Telangana3rd Nov 10:59 AMSunil Byrisetty1 min read
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ తాండూర్ డిపో ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ తాండూర్ డిపో ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఉస్మానియా ఆస్పత్రికి మృతదేహాలను తరలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రి బృందంతోపాటు, గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు సైతం పోస్టుమార్టంలో పాల్గొనాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గాంధీ ఆస్పత్రి నుంచి ఉస్మానియాకు వైద్యుల బృందం వెళ్లింది. మరోవైపు క్షతగాత్రుల కోసం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. బాధితులు వస్తే చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గాంధీ వైద్యుల బృందం తెలిపింది.