News4th Sep 04:01 PMSunil Byrisetty1 min read

టిడ్కో గృహాలపై ప్రజలను దగా చేసిన పాలకులు

జక్కంపూడి టిడ్కో కాలనీలో కాగితాల పైనే కేటాయింపులు, ఒక్కరు కూడా నివాసం ఉండలేని స్థితి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు అన్నారు. 8 ఏళ్లు గడిచినా.. లబ్ధిద

టిడ్కో గృహాలపై ప్రజలను దగా చేసిన పాలకులు
జక్కంపూడి టిడ్కో కాలనీలో కాగితాల పైనే కేటాయింపులు, ఒక్కరు కూడా నివాసం ఉండలేని స్థితి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు అన్నారు. 8 ఏళ్లు గడిచినా.. లబ్ధిదారులు నివాసానికి నోచుకోని దుస్థితి ఉందన్నారు. అద్దెలు, వడ్డీలు రూపంలో ఒక్కొక్క లబ్ధిదారుడిపై 9 లక్షల రూ.. భారం పడుతోందన్నారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్ల క్రితమే లక్ష రూపాయలు డిపాజిట్ కట్టినా, ఇప్పటికీ ఇళ్ళు ఇవ్వకపోవడంతో అద్దెలు, బ్యాంకు వడ్డీల భారం పెరిగిపోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో గృహ సముదాయాలు పాలకుల నిర్లక్ష్యానికి, అసమర్థతకు అడ్డం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల గృహ నిర్మాణాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో పేదలు బలి అవుతున్నారని పేర్కొన్నారు.
Andhra Pradesh
TIDCO Beneficiaries
TIDCO Houses
Jakkampudi TIDCO Colony
Jakkampudi
TIDCO Housing
CPM
C H Baburao
Vijayawada
పేదల ఇళ్లు
గృహ ప్రాజెక్టు
మౌలిక సదుపాయాలు
ప్రభుత్వ గృహాలు
అద్దె భారం
బ్యాంకు వడ్డీలు
ఏపీ హౌసింగ్ వార్తలు
Scroll for the next article