News3rd Dec 11:55 AMSunil Byrisetty1 min read

చారిత్రాత్మక కనిష్టానికి రూపాయి విలువ.. డాలర్‌కి 90

డాలర్ దెబ్బకు రూపాయి కుదేలవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం నాటి ఫారెక్స్ ట్రేడింగ్

చారిత్రాత్మక కనిష్టానికి రూపాయి విలువ.. డాలర్‌కి 90
డాలర్ దెబ్బకు రూపాయి కుదేలవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. బుధవారం నాటి ఫారెక్స్ ట్రేడింగ్‌లో రూపాయి విలువ తొలిసారిగా 90 మార్క్‌ను దాటి సరికొత్త ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఇది దేశీయ కరెన్సీ చరిత్రలో ఒక కీలక పరిణామంగా నిలిచింది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 89.96 వద్ద స్థిరపడిన రూపాయి, బుధవారం ఉదయం సెషన్ ప్రారంభమైనప్పటి నుంచే బలహీనంగా కదలాడింది. అమ్మకాల ఒత్తిడితో క్రమంగా క్షీణిస్తూ వచ్చిన రూపాయి విలువ, ఒక దశలో 90.14 వద్ద చారిత్రక కనిష్ఠాన్ని తాకింది. మార్కెట్ వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.12 వద్ద ట్రేడ్ అవుతోంది.
rupee value
dollar rate
historic low
forex market
Indian currency
global markets
rupee fall
economic affairs
forex trading
financial news
market trends
foreign exchange
rupee dollar exchange rate
Scroll for the next article