News16th Dec 02:35 PMSunil Byrisetty1 min read
ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి
రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. మంగళవారం రూపాయి విలువ మరింత పతనమై ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకపు విలువ 5 పైసలు క్షీణించింది. 90.83కు చేరింది. భారత్-అమ
రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. మంగళవారం రూపాయి విలువ మరింత పతనమై ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకపు విలువ 5 పైసలు క్షీణించింది. 90.83కు చేరింది. భారత్-అమెరికా డీల్‌పై అనిశ్చితులు, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాల వల్లే రూపాయి మారకం విలువ క్షీణిస్తోందని నిపుణులు అంటున్నారు. భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఒడుదొడుకులు, డాలర్‌కు డిమాండ్ పెరగడం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 91 మార్క్ కూడా దాటొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతొ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి బలహీనతను రాజకీయం చేయవద్దని కోరారు.