News3rd Oct 04:42 PMSunil Byrisetty1 min read
కూటమి పాలనలోనే పల్లెల్లో ప్రగతి
మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా నిత్యం కృషి చేస్తున్నానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి ప
మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా నిత్యం కృషి చేస్తున్నానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం రూరల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మచిలీపట్నం రూరల్ మండలం వాడపాలెంలో రూ.1.56 కోట్ల వ్యయంతో కమ్మవారి చెరువు నుండి వెంకట దుర్గాంబపురం వరకు 2.37 కి.మీల రోడ్డు, నెలకుర్రు గ్రామంలో నెలకుర్రు నుండి మాజేరు వరకు రూ.65 లక్షల వ్యయంతో 1.76 కి.మీల రోడ్డు, నెలకుర్రు నుండి పెదయాదర వరకు రూ.1.60 కోట్ల వ్యయంతో 1.80 కి.మీల బీటీ రోడ్డు, చిన్నాపురం గ్రామంలో చిన్నాపురం నుండి జిలగలదిండి వరకు రూ.1.16 కోట్ల వ్యయంతో 1.30 కి.మీల రోడ్డు, బోగిరెడ్డి పల్లె నుండి పిల్లన్నసాగర్ వరకు రూ.48 లక్షల వ్యయంతో 870 మీటర్ల బీటీ రోడ్డు, రుద్రవరం గ్రామంలో ఆర్ గొల్లపాలెం నుండి రుద్రవరం వరకు రూ.61 లక్షల వ్యయంతో 1.09 కి.మీల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నం ప్రగతి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మచిలీపట్నంలో తాగునీరు, సాగునీరు, డ్రైనేజీలు, కాలువలు, రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం రూరల్ మండలంలో రూ.330 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.