Politics9th Mar 12:55 PMSunil Byrisetty1 min read
ఒక్క రోజే 105 అభివృద్ధి కార్యక్రమాలు!
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ బహుశా ద
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టించారు.
దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ బహుశా దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అన్నారు.
ప్రజాప్రతినిధులకు స్పూర్తిగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కోటంరెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం అందరికీ స్ఫూర్తి అని కొనియాడారు.