News22nd Mar 05:18 PMSunil Byrisetty1 min read

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్

విశాఖ తీరంలో అందమైన బీచ్ రుషికొండ. సముద్ర తీరం ఒడ్డునే కొండ ఉండటం అక్కడి విశిష్టత. గత ప్రభుత్వంలో రుషికొండను తవ్వి ప్యాలెస్ కట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ రుషికొండ ఇప్పు

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్
విశాఖ తీరంలో అందమైన బీచ్ రుషికొండ. సముద్ర తీరం ఒడ్డునే కొండ ఉండటం అక్కడి విశిష్టత. గత ప్రభుత్వంలో రుషికొండను తవ్వి ప్యాలెస్ కట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ రుషికొండ ఇప్పుడో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతోంది. తాజాగా రుషికొండకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బృందం వచ్చింది. రుషికొండ బీచ్‌లోని సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించింది. ఆంధ్రా పర్యాటక శాఖ రుషికొండకు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు పర్యాటక శాఖ బీచ్ లో అనేక ఏర్పాట్లు చేసింది. బ్లూ ఫాగ్ గుర్తింపు వస్తే అంతర్జాతీయ స్థాయిలో రుషికొండ ప్రత్యేకత సంతరించుకుంటుంది.
Vizag
Rushikonda Beach
Blue Flag
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్
Scroll for the next article