News26th Sep 12:42 PMSunil Byrisetty1 min read

రుషికొండ ప్యాలెస్‌ వినియోగంలోకి.. ఎప్పుడంటే!

వైసీపీ ప్రభుత్వంలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. రెండేళ్లుగా కమిటీలు, పరిశీలనలు ఎన్నో జరిగినా తుదినిర్ణయం తీస

రుషికొండ ప్యాలెస్‌ వినియోగంలోకి.. ఎప్పుడంటే!
వైసీపీ ప్రభుత్వంలో అత్యంత విలాసవంతంగా నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. రెండేళ్లుగా కమిటీలు, పరిశీలనలు ఎన్నో జరిగినా తుదినిర్ణయం తీసుకోలేదు. గత పాలకులు ప్రజాధనంతో ప్యాలెస్ ను నిర్మించారని మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. హోటల్‌ రూమ్‌ల వినియోగానికి అనుగుణంగా ఈ ప్యాలెస్‌ లేదని తెలిపారు. దీంతో పెద్ద సంస్థలు నిర్వహణకు ముందుకు రావడం లేదన్నారు. ‘‘గత పాలకులు ఇష్టానుసారంగా రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించారు. గత ప్రభుత్వం చేసిన కొన్ని పాపాలు కడిగేందుకు జీవితాలే సరిపోవు. రుషికొండ ప్యాలెస్‌ను ఆతిథ్య రంగానికే అప్పగిస్తాం. వీలైనంత త్వరగా ప్యాలెస్‌ను వినియోగానికి తెస్తాం’’ అని చెప్పారు.
Scroll for the next article