National1st Oct 05:10 PMSunil Byrisetty1 min read

రష్యాలో ఉద్యోగం.. ఆఫర్ తీసుకుంటే దెబ్బతిన్నట్లే!

రష్యాలో ఉద్యోగం.. నెలకు రెండు లక్షల జీతం అంటే నమ్మేసి బయలుదేరుతున్నారా? అయితే దెబ్బతినడానికి సిద్ధం కావాల్సిందే. తాజాగా రష్యాలో ఉద్యోగాల పేరుతో జరిగిన ఓ మోసం దిగ్బ్రాంతి కలిగిస్తోం

రష్యాలో ఉద్యోగం.. ఆఫర్ తీసుకుంటే దెబ్బతిన్నట్లే!
రష్యాలో ఉద్యోగం.. నెలకు రెండు లక్షల జీతం అంటే నమ్మేసి బయలుదేరుతున్నారా? అయితే దెబ్బతినడానికి సిద్ధం కావాల్సిందే. తాజాగా రష్యాలో ఉద్యోగాల పేరుతో జరిగిన ఓ మోసం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. రష్యన్స్ ఇళ్ళలో పనిచేయడానికి భారీ వేతనాన్ని ఆఫర్ చేసిన ఏజెంట్ చెప్పిన మాయమాటలు నమ్మిన నలుగురు తెలంగాణ యువకులు దారుణంగా దెబ్బతిన్నారు. ఒక్కొక్కరూ ఏజంట్‌కి మూడు లక్షలు చొప్పున చెల్లించి రష్యా చేరుకుంటే యుద్ధభూమిలో బాంబుల మధ్య బిక్కుబిక్కుమనాల్సి వస్తోంది. డబ్బిచ్చి టెన్షన్ కొని తెచ్చుకోవడం అంటే అదేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రష్యాలో దిగిన వెంటనే పాస్ పోర్టులు తీసేసుకొని, చేతికి ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. అందుకే అలాంటి ఆఫర్లను నమ్మి మోసపోవద్దని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
Scroll for the next article