Education20th Aug 09:09 AMSunil Byrisetty1 min read
నైపుణ్యాభివృద్ధిలో వ్యూహాత్మక భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో రష్యా ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. పరిశ్రమ & వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు, రష్యన్ యూనియ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో రష్యా ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించింది. పరిశ్రమ & వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు, రష్యన్ యూనియన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఆంట్రప్రెన్యూర్స్ (RSPP), ప్రముఖ విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు ఈ బృందంలో పాల్గొన్నారు. ఈ సమావేశం టెక్నికల్, వొకేషనల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (TVET) రంగంలో అంతర్జాతీయ సహకారానికి ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
విశాఖపట్నంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్ (SD&T) ప్రధాన కార్యదర్శి కోన శశిధర్, APSSDC మేనేజింగ్ డైరెక్టర్ & CEO గణేష్ కుమార్ ప్రారంభించారు. రష్యన్ బృందానికి RSPP డిప్యూటీ చైర్మన్ ఇవనోవ్ మైఖేల్ సారధ్యం వహించారు. మెకానికల్, ఎలక్ట్రికల్, వెల్డింగ్, మెటలర్జీ రంగాల్లో నైపుణ్యం కలిగిన 12 మంది ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయాల కీలక పాత్రపై ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొ. జి.పి. రాజశేఖర్ సూచనలు చేశారు.