News12th Apr 03:45 PMSunil Byrisetty1 min read

బంగారు అయ్యప్పను ఇలా తెచ్చుకోండి!

అయ్యప్ప స్వామి చిత్రంతో బంగారు లాకెట్లను భక్తులకు అందుబాటులోకి తేవాలని శబరిమల నిర్ణయించింది. మలయాళ నూతన సంవత్సరం విషు పర్వదినం సందర్భంగా ఈ నెల 14 నుంచి స్వామి అయ్యప్ప చిత్రంతో బంగా

బంగారు అయ్యప్పను ఇలా తెచ్చుకోండి!
అయ్యప్ప స్వామి చిత్రంతో బంగారు లాకెట్లను భక్తులకు అందుబాటులోకి తేవాలని శబరిమల నిర్ణయించింది. మలయాళ నూతన సంవత్సరం విషు పర్వదినం సందర్భంగా ఈ నెల 14 నుంచి స్వామి అయ్యప్ప చిత్రంతో బంగారు లాకెట్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వివరాల ప్రకారం 1, 2, 4, 8 గ్రాముల బరువు గల బంగారు లాకెట్లను అందుబాటులో ఉంచుతారు. వాటిని కొనుగోలు చేయడానికి www.sabarimalaonline.org ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టవచ్చు. శబరిమల వెళ్లే భక్తులకు అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద విక్రయిస్తారు. లాకెట్ల ధరల కోసం కౌంటర్లు, వెబ్ సైట్‌ను సంప్రదించాలని చెబుతున్నారు.
Sabarimala
Ayyappa Gold Lockets
అయ్యప్ప స్వామి దేవాలయం
బంగారు లాకెట్లను భక్తులకు అందుబాటు
Scroll for the next article