Spiritual9th Jan 04:46 PMSunil Byrisetty1 min read

శబరిమల బంగారం కేసు.. పూజారి అరెస్ట్

శబరిమలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగారం తాపడాల కేసులో ప్రధాన పూజారి అరెస్టయ్యారు. శబరిమల తంత్రి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. నేడు ఉదయం సిట్ అధికారుల బృందం

శబరిమల బంగారం కేసు.. పూజారి అరెస్ట్
శబరిమలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగారం తాపడాల కేసులో ప్రధాన పూజారి అరెస్టయ్యారు. శబరిమల తంత్రి కందరారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేశారు. నేడు ఉదయం సిట్ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకొని.. విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. బంగారు తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో తేలడంతో అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. ఉన్ని కృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకువచ్చింది కూడా తంత్రి కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.
Sabarimala
Gold Theft Case
Chief Priest Arrested
Sabarimala Tantri
సిట్ విచారణ
కేరళ వార్తలు
దేవాలయ పరిపాలన
Scroll for the next article