News19th Nov 03:49 PMSunil Byrisetty1 min read

సత్యసాయి ఫోన్ చేసి, పుస్తకం పంపించారు: సచిన్

2011 ప్రపంచ కప్ సమయంలో తాను బెంగళూరులో ఉన్నప్పుడు సత్య సాయిబాబా తనకు ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన

సత్యసాయి ఫోన్ చేసి, పుస్తకం పంపించారు: సచిన్
2011 ప్రపంచ కప్ సమయంలో తాను బెంగళూరులో ఉన్నప్పుడు సత్య సాయిబాబా తనకు ఫోన్ చేసి ఒక పుస్తకం పంపించారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సచిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలను జడ్జ్ చేయకుండా వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పేవారని, అలా చేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్పారని వివరించారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునేవారని, వారి ఉన్నతికి ఆయన కృషి చేశారని వెల్లడించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని... సత్యసాయి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించేందుకు పాటుపడ్డారని సచిన్ కొనియాడారు.
India news
Sachin Tendulkar
Sathya Sai Baba
Putaparthi
Centenary Celebrations
2011 World Cup
Cricket News
Spiritual Leader
ఆధ్యాత్మిక నాయకులు
భారత వార్తలు
స్పిరిచ్యూవల్ స్టోరీస్
సచిన్ స్పీచ్
Scroll for the next article