Spiritual29th Aug 12:26 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర వార్షిక పవిత్రోత్సవాలు’ శనివారం నాటిత

ఇంద్రకీలాద్రిపై ముగిసిన పవిత్రోత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర వార్షిక పవిత్రోత్సవాలు’ శనివారం నాటితో శాస్త్రోక్తంగా, వైభవంగా ముగిశాయి. ముగింపు రోజైన శనివారం ఉదయం 9:30 గంటలకు కొండపై ఉన్న పాత యాగశాలలో ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితుల ఆధ్వర్యంలో పవిత్రోత్సవాల ముగింపు క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాత యాగశాలలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ యజ్ఞ పరిసమాప్తిని సూచిస్తూ వేద పండితులు మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం యాగశాలలో పూజించిన పవిత్ర జలాలతో దేవతామూర్తులకు, ఆలయ ప్రాంగణానికి సంప్రోక్షణ చేస్తూ శాంతి మార్జనము, ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల నివారణార్థం, లోక కళ్యాణార్థం ఈ పవిత్రోత్సవాలను ఆనవాయితీ ప్రకారం వైదికంగా నిర్వహించినట్లు వైదిక కమిటీ తెలిపింది.
Andhra Pradesh
Indrakeeladri
Vijayawada
Durga Malleswara Swamy Temple
Pavithrotsavam
Sacred Festival
Temple Celebrations
హిందూ భక్తి
ఆధ్యాత్మికత
పుణ్యకార్యక్రమం
మహా పూర్ణాహుతి
వైదిక క్రతువులు
ఆంధ్రప్రదేశ్ ఆలయాలు
భక్తి వార్తలు
Scroll for the next article