News26th Oct 04:34 PMSunil Byrisetty1 min read

త్వరలో సదరం స్లాటు బుకింగ్ ప్రారoభం

దివ్యాంగులకు ఉద్దేశించిన సదరం స్లాటు బుకింగ్ అవకాశాన్ని త్వరలో కల్పించబోతున్నారు. తుఫాను ప్రభావం ముగిసిన అనంతరం స్లాటు బుకింగ్కు అవకాశాన్ని కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్

త్వరలో సదరం స్లాటు బుకింగ్ ప్రారoభం
దివ్యాంగులకు ఉద్దేశించిన సదరం స్లాటు బుకింగ్ అవకాశాన్ని త్వరలో కల్పించబోతున్నారు. తుఫాను ప్రభావం ముగిసిన అనంతరం స్లాటు బుకింగ్కు అవకాశాన్ని కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుకింగ్ కోసం రెండు నెలల వరకు గడువు ఇవ్వనున్నారు. ఆన్లైన్ ద్వారా సుమారు 40వేల మంది దివ్యాంగులకు స్లాటు బుకింగ్ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు. వాట్సప్ మనమిత్ర, సచివాలయాల ద్వారా మాత్రమే కాకుండా. ఈ సారి అదనంగా ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ స్లాటు బుకింగ్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి పొందినట్లు వెల్లడించింది.
Scroll for the next article