News28th Dec 09:52 AMSunil Byrisetty1 min read
మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత అవసరం
మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ అన్నారు. రాజకీయ పార్టీలు, వృత్తి పరమైన సంస్థలలో "పోష్ చట్టం" అమలు అవసరం అనే అంశంపై మహి
మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ అన్నారు. రాజకీయ పార్టీలు, వృత్తి పరమైన సంస్థలలో "పోష్ చట్టం" అమలు అవసరం అనే అంశంపై మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ జరిగింది. సుప్రీమ్ కోర్టు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ, భద్రతపై అనేక తీర్పులు వెలువరించిందన్నారు. చట్టం అమలులో ఇంకా పూర్తి స్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని, ఇది రాజకీయ పార్టీలలోనూ, బార్ అసోసియేషన్ లలోను, విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలని చర్చించడం జరిగిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు.