News21st Sep 12:29 PMSunil Byrisetty1 min read

సాయికృష్ణ కేసులో నేడు కోర్టులో ఛార్జ్‌షీట్

గాదె సాయికృష్ణ కేసులో సిట్ నేడు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చనిపోలేదని సిట్ పేర్కొంది. పోలీసుల దెబ్బలతో సాయికృష్ణ తీవ్రంగా గాయపడినట

సాయికృష్ణ కేసులో నేడు కోర్టులో ఛార్జ్‌షీట్
గాదె సాయికృష్ణ కేసులో సిట్ నేడు కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చనిపోలేదని సిట్ పేర్కొంది. పోలీసుల దెబ్బలతో సాయికృష్ణ తీవ్రంగా గాయపడినట్లు సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయింది. కృష్ణలంక పీఎస్ నుంచి రాణిగారితోటలోని ఓ పాడుబడ్డ భవనానికి సాయికృష్ణను తరలించిన పోలీసులు అక్కడే ఉంచినట్లు సిట్ నిర్థారించింది. పాడుబడ్డ భవనంలోనే మే 12న స్పృహ తప్పి సాయికృష్ణ మృతిచెందినట్లు సిట్ తేల్చింది. అనంతరం, స్వర్గపురిలో సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేసినట్లు సిట్ గుర్తించింది. ఇవే విషయాలను ఛార్జ్ షీట్లో పేర్కొన్న సిట్ నేడు కోర్టులో దాఖలు చేయనుంది.
Scroll for the next article