Politics29th Dec 05:16 PMSunil Byrisetty1 min read
వైసీపీ కమిటీల నియామకంపై సజ్జల దిశానిర్దేశం
వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్
వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టిపెట్టాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్సులో ఇది ఒక స్పెషల్ డ్రైవ్ లా ముందుకు తీసుకెళ్ళాలన్నారు. అందరూ ఫోకస్‌తో పనిచేయాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని జగన్ ప్రత్యేకంగా చెప్పారన్నారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలని స్పష్టం చేశారు. విలేజ్, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలని, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలని సూచనలు చేశారు. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్దం చేశామని వివరించారు.